
శుభాకాంక్షలు
Dr. S. BASHEER, Chennai
పరమ పావన జీసస్ కరుణా కటాక్షంతో
పునీత మేరీమాత ఆశీర్వచనాలతో
దివ్య కల్యాణ శుభ వేళలో
నవ్య పవిత్ర జీవనంలో ప్రవేశించిన
మిత్రులు ‘శ్రీ శరత్ బాబు – సుష్మల’ ముద్దుల తనయ
నవ వధువు సౌభాగ్యవతి ‘సుష్మిత’
చిరంజీవి ‘శ్రీ రవి కుమార్ ను’ పరిణయ శుభ ఘడియలో
ఇరువురి ఆనందమయ జీవితం – వసంతంలా శోభిల్లాలనీ,
అపార అనురాగ దాంపత్యంలో, కోటి సిరులు పండాలనీ,
స్నేహ సౌహార్దాలు విలసిల్లాలని,
జీవన నందన వనంలో, మూడు పువ్వులు – ఆరు కాయలుగా శోభిల్లాలనీ
అందిస్తున్నాను నూతన వధూ వరులకు
వివాహాది శుభాకాంక్షలు.


